యువతి ఆత్మహత్య కేసు.. ముగ్గురు అరెస్ట్

యువతి ఆత్మహత్య కేసు.. ముగ్గురు అరెస్ట్

కడపలో నిశ్చితార్థం తర్వాత పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి రెహనా ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడు షాజహాన్, అతని తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.