ఉమ్మడి జిల్లాలో నేడు భారీ వర్షం

ఉమ్మడి జిల్లాలో నేడు భారీ వర్షం

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వరి కోతలు జరుగుతుండగా, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. వరి, మొక్కజొన్న, మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.