VIDEO: గూడూరులో బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు

VIDEO: గూడూరులో బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు

TPT: గురువారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద పల్లె వెలుగు బస్సు ఒక వ్యక్తిని ఢీకొట్టింది. అయితే అకస్మాత్తుగా ముందుకు వచ్చిన ఆ వ్యక్తిని తప్పించేందుకు డ్రైవర్ బ్రేక్ వేయడంతో స్వల్ప ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని ఆటోలో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.