గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్

వరంగల్: నర్సంపేటలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. పొడుగు వరుణ్ దొర, పాసీ ప్రవీణ్ కుమార్ అనే యువకుల వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతూరు మండలం మోతుగూడెం నుంచి నర్సంపేట మీదుగా వరంగల్లో తీసుకెళ్తుండగా, పట్టుబడారు.