VIDEO: పేరుకుపోయిన చెత్త.. అపరిశుభ్రంగా పార్క్ పరిసరాలు

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని గాంధీ పార్క్ పరిసరాల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వస్తోందని స్థానికులు తెలిపారు. ఈ పార్క్ మార్కెట్ ఏరియాలో ఉండటంతో దుకాణ సముదాయాల వ్యర్థాలు వేస్తున్నారని వాపోయారు. దీంతో వచ్చే దుర్గంధం వల్ల పార్కుకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి పార్కు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.