కుందుర్పిలో మేకల మందపై చిరుత దాడి

కుందుర్పిలో మేకల మందపై చిరుత దాడి

ATP: కుందుర్పి మండలం కేంచంపల్లిలో సోమవారం అర్ధరాత్రి తర్వాత గొర్రెల కాపరి సురేశ్‌కు చెందిన గొర్రెలు, మేకలపై చిరుత, నక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఒక మేక మృతి చెందగా, పలు గొర్రెలు గాయపడ్డాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని బాధితుడు ఆరోపించారు.