ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి

NLR: సంగం మండలంలోని పలు ప్రాంతాల్లో ఈనెల ఆరవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఆధార్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి షాలెట్ తెలియజేశారు. నూతన ఆధార్ కార్డులు నమోదు చేయుట, ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేయడం తదితర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.