ప్రజా దర్బార్‌లో ప్రజల సమస్యలు విన్న ఎమ్మెల్యే
PLD: వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జీవీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని సావధానంగా విన్న ఆయన, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.