రైలు సేవల కోసం కృషి చేస్తున్నా: కేంద్రమంత్రి

రైలు సేవల కోసం కృషి చేస్తున్నా: కేంద్రమంత్రి

AP: పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం వరకు వందేభారత్ రైలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నానని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. అత్తిలిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు, తాడేపల్లిగూడెంలో వందే భారత్ హాల్ట్ ఉండేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అరుణాచలం రైలు సర్వీసులు రెగ్యులర్ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.