'మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలి'

'మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలి'

KRNL: కోల్‌కతాలో వైద్యాధికారి మోమితపై అత్యాచారం చేసిన నిందితులను చట్టపరంగా శిక్షించాలని కోరుతూ నంద్యాలలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో నాయకులు శనివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు రఫీ మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు షాహిద్ పాల్గొన్నారు.