నేటి నుంచి పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు

నేటి నుంచి పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు

ప్రకాశం: కనిగిరి సబ్ డివిజన్లో నేటి నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఈ సమయంలో అనుమతి లేనిదే ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు చేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలను అందరూ పాటించాలని ఆయన సూచించారు.