రాత్రి వేళలో చోరీలు చేస్తున్న దొంగలు అరెస్ట్

రాత్రి వేళలో చోరీలు చేస్తున్న దొంగలు అరెస్ట్

VSP: విశాఖలో గత కొద్దికాలం క్రితం పెందుర్తి మండలం పాపయ్య రాజుపాలెం లో జరిగిన ఇంటి దొంగతనానికి పాల్పడిన ముగ్గురు దొంగలను పెందుర్తి క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో క్రైమ్ సీఐ కే.శ్రీనివాసరావు వారి వివరాలు వెల్లడించారు. దొంగతనానికి పాల్పడిన వారి నుంచి 45 కిలోల వెండి, 3 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.