మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మహిళలకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా మహిళలకు పుట్టింటి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను అందిస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.