"స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించండి'

CTR: జిల్లాలో జరుగుతున్న ఎన్‌సీడీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు సీఎంసీ స్టార్ ఎన్‌సీడీఐసీ ఎంఆర్ వారి సాంకేతిక సహకారంతో మరింత సమర్థవంతంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలో స్క్రీనింగ్ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి సమావేశం నిర్వహించి సమీక్షించారు.