గంజాయి అరికట్టడంలో భాగస్వామ్యలు కావాలి:MLA
NLR: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ తెలుగు యువత గంజాయికి వ్యతిరేకంగా గళం విప్పింది. మాగుంట లేఔట్లోని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నివాసంలో తెలుగు యువత నాయకులు "గంజాయి వద్దు బ్రో" పోస్టర్ ఆవిష్కరించారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో గంజాయి అమ్మకాలు, సేవనం జరిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను ఆదేశించారు.