ఇంటర్ విద్యార్థిని స్వర్ణక్క మృతి...
WGL: రాయపర్తి మండలం నానోతండాకు చెందిన శ్రీనివాస్ నాయక్, సుజాత దంపతుల పెద్ద కుమార్తె స్వర్ణక్క(18) మృతి చెందింది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఆమె మానసిక సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. చదువులో మెరుగైన ప్రతిభ చూపుతూ కుటుంబానికి తోడుగా నిలవాలనుకున్న స్వర్ణక్క మృతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.