గురుకుల పాఠశాలలో సీఐ అవగాహన సదస్సు
KKD: పిఠాపురం గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు మహిళల భద్రత, రక్షణ, భవిష్యత్ నిర్మాణంపై సీఐ శ్రీనివాస్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జ్ డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులకు పాఠశాల, ఇంటి పరిసరాలు, ప్రజా ప్రదేశాలు, ప్రయాణ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.