VIDEO: తిరుచ్చిపై ఊరేగిన పద్మావతి అమ్మవారు

VIDEO: తిరుచ్చిపై ఊరేగిన పద్మావతి అమ్మవారు

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం బంగారు తిరుచ్చిపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సాయంత్రం అమ్మవారిని శోభాయామానంగా అలంకరించి తిరుచ్చిపై కొలువుదీర్చి తిరువీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు.