వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసిన మంత్రి

NDL: బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలో సోమవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. మాది రైతు ప్రభుత్వం రైతుల కోసం కూటమి ప్రభుత్వం ఏమైనా చేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. అనంతరం రైతులకు సబ్సిడీ కింద మంజూరు అయిన వ్యవసాయ పనిముట్లను మంత్రి పంపిణీ చేశారు.