VIDEO: మండలంలో దంచి కొడుతున్న వర్షం

VIDEO: మండలంలో దంచి కొడుతున్న వర్షం

NLR: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం 6 గంటల నుంచి గాలి వానతో కూడిన వర్షం కురుస్తుంది. నాట్లు సీజన్ కావడంతో రైతన్నలు ఈ వర్షంతో కాస్త తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.