రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే
KRNL: గోనెగండ్ల మండలం గంజహళ్లిలో ఇవాళ MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో ఉన్న మహాత్మా బడే సాహెబ్ దర్గాను దర్శించుకున్నారు. అనంతరం రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నూతన రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు.