నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం: ఎస్సై

నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం: ఎస్సై

MHBD: రానున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించవద్దని తొర్రూరు ఎస్సై ఉపేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.