నేడు ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం

తూ.గో: చాగల్లు సబ్ స్టేషన్ పరిధిలోని పలు ఫీడర్ల వార్షిక మరమ్మతుల వల్ల ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని EE అప్పారావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చాగల్లు, నెలటూరు, మీననగరం గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. చాగల్లు MHO, వీవీ షుగర్స్ ఫీడర్ల పరిధిలో ఈ కోత ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.