ధర్మపురి క్షేత్రంలో ఘనంగా శంకర జయంతి
JGL: ధర్మపురి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ మండపంలోని ఉప ఆలయమైన శ్రీ శారదాదేవి శంకరాచార్య ఆలయంలో మంగళవారం శంకర జయంతి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. కలశ గణపతి పూజ శ్రీ శంకరాచార్యుల విగ్రహానికి పంచామృతాలతో వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు. అష్టోత్తర శతనామార్చన నివేదన మంగళహారతి ప్రసాద వితరణ చేశారు.