రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు గాయాలు

ప్రకాశం: పొదిలి మండలం కంబాలపాడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు వారి కుమారుడికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.