VIDEO: సిద్ధి వినాయక ఆలయంలో భక్తుల రద్దీ

VIDEO: సిద్ధి వినాయక ఆలయంలో భక్తుల రద్దీ

SRD: పటాన్‌చెరు మండలం రుద్రారం శివార్లోని గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈరోజు సెలవు దినం కావడంతో సూదూర ప్రాంతాల నుంచి భక్తుల రాకతో సందడి నెలకొంది. ఆలయంలో అర్చకులు వినాయక స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు ప్రాతః కాల మంగళ హారతి చేశారు. స్వామిని, మంగళ హారతిని భక్తులు దర్శించి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు వేశారు.