గురుకులంలో రాత్రి బస చేసిన ఎంపీ కలిశెట్టి
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నిన్న పూసపాటిరేగ మండలం కొప్పెర్ల డా. B.R అంబేద్కర్ గురుకులంలో విద్యార్థులతో కలిసి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయనే స్వయంగా వడ్డన చేసి, వారితో పాటు భోజనం చేశారు. అనంతరం అక్కడే గురుకులం విద్యార్థుల మధ్య రాత్రి బస చేసారు. ఈ కార్యక్రమంలో AP మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు పాల్గొన్నారు.