ప్రపంచానికి ఉన్న ముప్పును తొలగించాం: నెతన్యాహూ
ప్రపంచానికి ఉన్న ముప్పును అమెరికాతో కలిసి తొలగించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వెల్లడించారు. ఇరాన్ నిరంకుశ పాలకులు పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. పౌరులను రక్షించేందుకు పాలకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలిపారు. ఇరాన్, తమను, అమెరికాను బెదరిస్తోందని గతంలోనే చెప్పినట్లు వివరించారు. అలాగే యూరప్‌నూ లక్ష్యంగా చేసుకుంటుందని చెప్పానన్నారు.