డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన కారు

డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన కారు

RR: అత్తాపూర్లోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో ముగ్గురు మహిళలతోపాటు ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఓవర్ స్పీడ్ కారణంగా కారు పల్టీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.