తంబళ్లపల్లెలో వికసించిన మే పుష్పాలు

చిత్తూరు: తంబళ్లపల్లె వెంకటేశ్వర వీధికి చెందిన లక్ష్మీనరసమ్మ ఇంటి పెరట్లో అరుదైన మే పుష్పాలు ఆదివారం ఒకేసారి 3 వికసించి కనువిందు చేస్తున్నాయి. ఏడాదిలో మేలో మాత్రమే వికసించే పుష్పాలను చూసేందుకు చుట్టుపక్కల వారు తరలి వస్తున్నారు. ఎర్రటి బంతి ఆకారంలో చూడగానే ఆకట్టుకునేలా ఉన్న పుష్పాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి.