విద్యుత్ కాంతుల మధ్య మహబూబాబాద్ కలెక్టరేట్

BHBD: ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సిద్ధమైంది. గురువారం సాయంత్రం త్రివర్ణ విద్యుత్ దీపాలతో కార్యాలయాన్ని అలంకరించారు. ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేయాలని కలెక్టర్ ఇటీవల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కాగా ఇప్పటికీ అన్ని పాటలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.