'గురజాడ నివాసాన్ని సందర్శించడం నా అదృష్టం'
VZM: జిల్లాకేంద్రంలోని మహాకవి గురజాడ అప్పారావు స్వగృహాన్ని జస్టిస్ సి.హెచ్. మానవేంద్రనాథ్ రాయ్ శనివారం రాత్రి సందర్శించారు. ఈమేరకు గురజాడకు చెందిన చిత్రాలు, ఉపయోగించిన వస్తువులు, రచనలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గురజాడ నివాసాన్ని సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, చిన్ననాటి నుంచి ఆయన రచనలను చదువుతున్నానని అన్నారు.