'పోరు గర్జన సభను విజయవంతం చేయాలి'
వరంగల్ బహుజనుల హక్కుల సాధన కోసం నిర్వహించబడుతున్న బహుజన ఓరుగల్లు ‘పోరు గర్జన’ సభను విజయవంతం చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ అన్నారు. శుక్రవారం బీఎస్పీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బహుజనుల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే చారిత్రాత్మక సభగా ఈ కార్యక్రమం నిలవాలని ఆకాంక్షించారు. సభకు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.