ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
NLG: ఈనెల 11వ తేదీన జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల కొరకు శాలిగౌరారం మండల కేంద్రంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ సూచించిన ఎన్నికల నియమావళిని ప్రిసైడింగ్ అధికారులకు వివరించారు.