బొల్లారంలో గంజాయి చాక్లెట్ల కలకలం

బొల్లారంలో గంజాయి చాక్లెట్ల కలకలం

HYD: ఐడీఎ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్ల కలకలం రేపింది. జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధి లక్ష్మీనగర్‌లో నివాసం ఉండే ఒడిశాకు చెందిన అజయ్ కుమార్ (50) పాన్‌షాప్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని 238 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.