భారత నేవీ దళంలోకి INS తమల్

భారత నావికా దళంలోకి మరో శక్తివంతమైన యుద్ధనౌక వచ్చి చేరనుంది. నౌకాదళ అమ్ములపొదిలోకి INS తమల్ రానుంది. ఇది మే 28న రష్యా నుంచి భారత్‌కు చేరుకోనుంది. నేల, నీరు, గాలిలో నుంచి శత్రవులపై దాడి చేయగల సామర్థ్యం తమల్‌కు ఉంది. భారత్‌కు రానున్న చివరి విదేశీ యుద్ధనౌక ఇదే కానుంది. కాగా.. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో త్రివిధ దళాల బలం పెంచేందుకు కేంద్రం యత్నిస్తోంది.