నేడు మాచారెడ్డిలో పర్యటించనున్న మంత్రి సీతక్క

KMR: జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క ఇవాళ మాచారెడ్డి మండలంలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నౌసిలాల్ నాయక్ గురువారం తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.