లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

ADB: 44వ జాతీయ రహదారిపై దేవీతండా దాబా వద్ద నిబంధనలకు విరుద్ధంగా నిలిపి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఇచ్చోడకు చెందిన నరసింహారెడ్డి(20), తన స్నేహితుడు విశాల్‌తో కలిసి కారులో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో నరసింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విశాల్ స్వల్పగాయాలతో బయటపడ్డారు.