కాకతీయుల శిల్ప వైభవం.. రామప్ప ఆలయం

కాకతీయుల శిల్ప వైభవం.. రామప్ప ఆలయం

ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం 13వ శతాబ్దంలో కాకతీయుల సేనాపతి రేచర్ల రుద్రుడు నిర్మించారు. రామప్ప అనే శిల్పి చేత నిర్మించబడిన ఈ ఆలయం ప్రత్యేక శిల్పకళతో ప్రసిద్ధి చెందగా ఆయన పేరు మీదుగానే ఆలయం ఉండడం ఇక్కడి విశేషం. ఈ ఆలయం తేలికపాటి ఇటుకలతో నిర్మాణం చేయబడింది. ఈ ఆలయం 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది.