సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఏఎస్పీ

సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఏఎస్పీ

SRCL: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఆయనకు ఈ మెడల్‌ను అందజేశారు. 34 సంవత్సరాల సుదీర్ఘ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్‌కు ఆయనను ఎంపిక చేశారు. పలువురు ఏఎస్పీ చంద్రయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.