వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం

E.G: విజయవాడ వరద బాధితుల సహాయార్థం రంగంపేట గ్రామానికి చెందిన భారతి పాఠశాల విద్యార్థుల సేకరించిన విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి పాఠశాల హెడ్మాస్టర్ మహాలక్ష్మి కరస్పాండెంట్ ఉమామణి అందజేశారు. అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కలిసి రూ.32వేల డీడీని వారు అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే నల్లమిల్లి అభినందించారు.