అక్రమ కట్టడాలను అడ్డుకున్నతహసీల్దార్
NLR: కలువాయి మండలంలోని నాయి బ్రాహ్మణ కాలనీ, పూస కాలనీ ప్రాంతాల్లో ప్లాట్లు ఆక్రమణ రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ భూములను కొందరు యథేచ్చగా ఆక్రమిస్తున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ కృష్ణారెడ్డి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని అడ్డుకున్నారు. భూమికి సంబంధించి సరైన పత్రాలు లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.