యూరియా కోసం రైతుల ఇక్కట్లు

యూరియా కోసం రైతుల ఇక్కట్లు

ASF: తిర్యాణి మండలంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం స్టాక్ అయిపోవడం వల్ల సోమవారం కొత్త లోడ్ వస్తుందనే సమాచారంతో ఉదయం నుంచే పీఏసీఎస్ కార్యాలయానికి రైతులు చేరుకున్నారు. ఎక్కువసేపు నిలబడలేక, చెప్పులను క్యూలో ఉంచి చెట్ల కింద సేదతీరుతున్నారు. పనులు మానుకొని వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.