మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాకు ఘన నివాళి

SRD: మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఆదివారం పటాన్‌చెరు అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ వడ్లూరి శ్రీనివాస్, నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాప అధ్యక్షుడు మెట్టు శ్రీధర్, రుద్రారం శంకర్ తదితరులు కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.