22 మంది పాక్ సైనికులు మృతి

పాకిస్తాన్‌కు ఆ దేశ రెబల్ గ్రూప్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తలపోటుగా మారింది. ఇప్పటికే పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బాంబు దాడి చేసిన BLA.. మరోసారి తుర్బత్, డుక్కీలో అటాక్ చేసింది. ఈ దాడుల్లో 22 మంది పాక్ సైనికులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఆరుగురు BLA ఫైటర్లు చనిపోయారు. ఇంకా ఇరువర్గాల మధ్య ఘర్షణ కొనసాగుతుంది. ఇప్పటికే మంగోచార్ ప్రాంతాన్ని BLA స్వాధీనం చేసుకుంది.