మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ
SS: హిందూపురం వైసీపీ ఇంఛార్జి టీఎన్ దీపిక శనివారం పూలకుంట గ్రామంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వ మెడలు వంచుతామని ఆమె హెచ్చరించారు. పేదలకు ప్రభుత్వ వైద్యం అందకుండా చేయడమే చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు.