VIDEO: జడ్డంగిలో శివరాత్రి శోభ.. పోటెత్తిన భక్తులు
ASR: రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో ఆదివారం రాత్రి శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి రథోత్సవం మేళతాళాల నడుమ కన్నుల పండువగా సాగింది. చిన్నారుల కోలాటం, సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో జరిగిన తిరుణాళ్లకు భక్తులు వేలాదిగా తరలిరావడంతో జడ్డంగి జనసంద్రమైంది.