ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు RBI షాక్!

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు RBI షాక్!

నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌పై RBI రూ.31.8 లక్షల జరిమానా విధించింది. కస్టమర్ ఫిర్యాదుల సమాచారాన్ని దాచిపెట్టినట్లు విచారణలో తేలడంతో ఈ చర్య తీసుకుంది. అయితే, ఇది కేవలం నిబంధనల పరమైన చర్య మాత్రమేనని, కస్టమర్ల లావాదేవీలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని  RBI స్పష్టం చేసింది. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.