శుక్రవారం: నేటి తిరుమల సమాచారం
TPT: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా.. 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,017 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 26,863 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ద్వారా రూ.3.79 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.