సచివాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనం

సచివాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనం

కృష్ణా: నాగాయలంక మండలం మర్రిపాలెం సచివాలయ కార్యాలయం ఉదయం 10:30 గంటలకు కుర్చీలు ఖాళీగా కనిపించాయి. పది మంది సిబ్బంది ఉన్నప్పటికీ, కేవలం ఒకరు మాత్రమే విధులకు హాజరయ్యారు. అయితే హాజరు పట్టికలో అందరూ వచ్చినట్లుగా చూపించారు. పంచాయతీ కార్యదర్శి తప్ప మరో ఉద్యోగి అందుబాటులో లేకపోవడంతో పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు.